తప్పుడు వార్తలు రాసారని జర్నలిస్ట్ అనంచిన్ని వెంకటేశ్వరరావు అరెస్టు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 12, 2020

తప్పుడు వార్తలు రాసారని జర్నలిస్ట్ అనంచిన్ని వెంకటేశ్వరరావు అరెస్టు


హైదరాబాద్‌ ప్రతినిధి, జూలై 11(శుభ తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మైలార్‌ దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్లో ఆదాబ్‌ హైదరా బాద్‌ దిన పత్రిక రిపోర్టర్‌ అనంచిన్ని వెంకటేశ్వరరావుపై తప్పుడు వార్తలు రాశారనే నెపంతో కేసు నమోదు చేసి ఉన్నఫలంగా రిమాండ్‌ కు తరలించారు. ఈరోజు ఉదయం ఖమ్మం నుండి తీసుకు వచ్చిన ప్రత్యేక పోలీసులు కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేకుండా మైలార్‌ దేవ్‌ పల్లి పోలీస్‌ స్టేషన్లో వెంకటేశ్వర రావుపై కేసు నమోదు చేయడం జరిగింది. అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు మీడియాకు పూర్తి వివరాలు ఇంకా తెలపటం లేదు. వివరణ కోసం ఎవరు ఫోన్లు చేసిన వారు స్పందిం చడం లేదని తెలుస్తోంది. అయితే వెంకటేశ్వర రావు ఏ తప్పుడు వార్త రాసి చేసిన నేరం ఏమిటో ఎందు కు అరెస్టు చేసి హఠాత్తుగా జైలుకు పంపించారో మాత్రం ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. వెంకటేశ్వర రావు ఆదాబ్‌ హైదరాబాద్‌ దినపత్రికలో ఇటీవలే కొన్ని సంచలనాత్మకమైన పరిశోధనాత్మక వార్తలు ప్రచురించారు. అయితే దీనిపై పెను దుమారం రేగింది. వెంకటేశ్వరరావుకు ఇటీవలే సంబంధం లేని వార్తలు అంటగట్టే ప్రయత్నం జూబ్లీహిల్స్‌ పోలీసులు చేశారు. అయితే అందులో వెంకటేశ్వరరావు తప్పు లేదని తెలుసుకున్న పోలీసులు శనివారం మరోసారి మైలార్‌ దేవ్‌ పల్లి పోలీస్‌ స్టేషన్లో హుటాహుటిన కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు వెంకటేశ్వరరావును అరెస్టు చేయడం అక్రమమని జర్నలిస్ట్‌ సంక్షేమ సంఘం విమర్శిస్తోంది. దీనిపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని నిబంధనలకు విరుద్ధంగా జర్నలిస్టులపై జరుగుతున్న ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సంఘం హెచ్చరించింది. కాగా... ఆదాబ్‌ హైదరాబాద్‌ రిపోర్టర్‌ అయినటువంటి ఆనంచిన్ని వెంకటేశ్వర్‌ రావు ప్రస్తుతము ఉన్న కరోనా మహమ్మారి విపత్కర సమయములో... ప్రజలను భయందోలనలకు గురి అయ్యేట్టు వదంతులు, అపోహలు సృస్టిస్తూ మరియు ఆధారము లేని నిరాధారమైన తప్పుడు వార్తలతో గత కొన్ని రోజులుగా సమాజము లో వైషమ్యములను సృష్టిస్తూ ప్రజా ఆరోగ్య వ్యవస్థను దెబ్బ తీసే విధముగా విద్వేషపూరిత తప్పుడు వార్తలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారము చేయడానికి కుట్ర పన్నినారు. ఇట్టి విషయము లో సైబరాబాద్‌ కమీషనరేటు పరిధిలోని మైలరుదేవుపల్లి పోలీసు స్టేషనులో నమోదైన క్రిమినల్‌ కేసులో ఈరోజు ఆనంచిన్ని వెంకటేశ్వర్‌ రావుని అరెస్టు చేసి రేమండ్‌కి పంపడం జరిగిందని పోలీసులు ప్రకటనలో తెలిపారు.