మిషన్‌ భగీరథ అపూర్వ పథకం - జాతీయ జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రశంసలపై మంత్రి ఎర్రబెల్లి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 18, 2020

మిషన్‌ భగీరథ అపూర్వ పథకం - జాతీయ జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రశంసలపై మంత్రి ఎర్రబెల్లి


హైదరాబాద్ , జులై 18 , శుభ తెలంగాణ :  అపర భగీరథుడిలా కేసీఆర్‌ మిషన్‌ భగీరథ అపూర్వపథకానికి అంకురా ర్పణ చేశారని చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి న మిషన్‌భగీరథ ప్రాజెక్టును జాతీ య జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రశంసించ డం తెలంగాణ ప్రభుత్వ చిత్తశు ద్ధికి నిదర్శనమని పంచాయితీరాజ్‌, గ్రామాణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు. జల్‌జీవన్‌ ప్రశంసల నేపథ్యంలో మంత్రి సమోక్షించారు. మిగిలిన భగీరథ కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న మిషన్‌ భగీరథ విజయవంతానికి తార్మానమని అన్నారు. మిషన్‌ భగీరథని అధ్యయనం చేయాలని జల్‌జీవన్‌ మిషన్‌ ఇతర రాష్ట్రాలకు సూచించడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. సీఎం కేసీఆర్‌ ముందు చూపు, దృక్ళధాలే దేశానికి కూడా దిశా నిర్మేశాలుగా నిలుస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలలంగాణలో మంచినీటి కష్టాలు అన్నీ ఇన్నీక్రావు. ఎండాకాలం వచ్చిందంటే ఎక్కడా చూసినా నీటి కష్టాలే కనిపించేవి. నల్లాలు, బోరింగ్‌ల వద్ద మహిళలు జుట్లుపట్టుకున్న దృశ్యాలు కనిపించేవి. ఎండాకాలమంటే ఓ నరకయాతనగా ఉండేదన్నారు. నల్లగొండ జిల్లాలో అయితే ఫ్లోరైడ్‌తో ప్రజలుఎన్నో బాధలు అనుభవించారని చెప్పారు. సుదీర్థ పోరాటంతో తెలంగాణను తెచ్చుకున్నాం. ఉద్యమనేత కేసీఆర్‌ సీఎం అయ్యారు. అదే తెలంగాణకు కలిసివచ్చిందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. 30ఏళ్ల క్రితమే సింగూరు జలాలతో సిద్దిపేట ప్రజలకు ఇంటింటికీ నల్లాల దారాఆ మంచినీరు అందించిన కేసీఆర్‌ సక్సెస్‌పుల్‌ ప్రయోగమే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరికీ ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందించడానికి దోహదపడింద న్నారు. 46,123 కోట్లఅంచనా వ్యయంతో 99 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని 23,968 గ్రామాణావాసాలు, 120 పట్టణ, స్థానిక సంస్థలలో రాష్ట్రంలోని మొత్తం 71లక్షల 61వేల ఇండ్లకు నల్లాల ద్వారా స్వచ్చమైన తాగునీరు అందించడ మే ఈపధకం లక్ష్యమని అన్నారు.