ఉస్మానియాను కూల్చి.. కొత్త ధవాఖానా కట్టండి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 21, 2020

ఉస్మానియాను కూల్చి.. కొత్త ధవాఖానా కట్టండిహైదరాబాద్‌,జూలై21(శుభ తెలంగాణ): శిధిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని కూల్చి... కొత్త ఆస్పత్రిని నిర్మించాలని ఉస్మానియా వైద్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిని కాపాడండి అని డాక్టర్లు బ్యానర్లు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. కూలిపోతున్న బిల్జింగ్‌ను కూల్చవద్దు అంటూ కొందరు అద్దుపడడం వారి అవివేకానికి నిదర్శనమని దాక్టర్లు ధ్వజమెత్తారు. పాత భవనాన్ని కూల్చి కొత్త భవనాన్ని కట్టాలని, ఈ విషయంలో ప్రభుత్వానికి అండగా ఉంటామని వైద్యులు తేల్చిచెప్పారు. గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ భవనాన్ని పరిశీలిం చి.. కొత్త బిల్జింగ్‌ నిర్మించడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని డాక్టర్లు గుర్తు చేశారు. కానీ కొంతమంది అద్దుకుని, కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం సరైనది కాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉ స్మానియా నూతన భవన నిర్మాణానికి అడ్డు పడితే సహించేది లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. ప్రాణాలు నిలబెట్టడానికి ఈ ఆస్పత్రిని కట్టారు. కానీ ఇప్పుడు అది కూలి రోగులతో పాటు వైద్యుల ప్రాణాలు తీసేలా ఉందన్నారు. కచ్చితంగా ఉస్మానియా ఆస్పత్రిని నూతనంగా నిర్మించి తీరాలని వైద్యులు విజ్ఞప్తి చేశారు. </div>