టూరిజం హబ్‌గా పైడిపాల: ఎర్రబెల్లి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 15, 2020

టూరిజం హబ్‌గా పైడిపాల: ఎర్రబెల్లి


వరంగల్‌ ప్రతినిధి, జూలై 15(శుభ తెలంగాణ): నగరంలోని పైడిపల్లి ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయుటకు ప్రణాళిక రచించాలని రాష్ట్రంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వర్ధన్నపేట శాసనసభ్యులు అరూరి రమేష్‌ వరంగల్‌ నగర మేయర్‌ గుండా వ్రకాళ్‌ రావుతో కలసి నగరంలోని 1వ డివిజన్‌ పైడిపల్లి లో ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక శాసన సభ్యులు అరూరి రమేష్‌ ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు న్నాయని వాటిని అభివృద్ధి చేయాలని మంత్రి కేటీఆర్‌ కు విన్నవించగా కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగిందని మంత్రి తెలిపారు. నగరానికి దగ్గరగా ఉన్నందున సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమిలో అన్ని విధాలా అభివృద్ధి చేయుటకు వారం రోజుల్లోగా ప్రణాళికకు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించా రు. దీని ద్వారా ఈప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చని అన్నారు. ఇదివరకే 18 ఎకరాల భూమి మునిసిపల్‌ కార్పొరేషన్‌ కు ఒప్పజెప్పడం జరిగిం దని, మిగిలిన 32 ఎకరాలు కార్పొరేషన్‌ కు ఒప్పజెప్పి అభివృద్ధి చేస్తామని అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరురి రమేష్‌ మాట్లాడుతూ వరంగల్‌ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఆదేశించిన మేరకు, వర్ధన్న పేట నియోజకవగంలోని విలీన గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఒక ప్రదే శాన్నిప్రభుత్వ భూమి అన్యాక్రాంతంకాకుండా  అభివృద్ధిచేస్తున్నట్లు అందు లో భాగంగా బెస్తాం చెరువులో స్పృతి వనం, చింతగట్టు, పైడిపల్లిలలో అభివృద్ధికి శ్రీకారంచుట్టి అతి త్వరలో విజయవంతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో అధికారులు,కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.