ఆర్ యు బి నిర్మాణంతో తగ్గనున్న దూరం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 30, 2020

ఆర్ యు బి నిర్మాణంతో తగ్గనున్న దూరం

సనత్‌నగర్‌లోని ఇండస్ర్టియల్‌ ఏరియాలో రూ.68.30 కోట్లతో చేపట్టనున్న రైల్వే అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూవబీ) నిర్మాణ పనులకు రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌, పశుసంవర్ధ క శాక మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కలిసి బుధవారం శంకు స్థాపన చేశారు. ప్రస్తుతం రెండు లేన్‌లుగా ఉన్న ఫతేనగర్‌ ప్లై ఓవ ర్‌ బ్రిడ్జిని సుమారు 400 మాటర్లు మేర రూ.45.04 కోట్లతో నాలు గు లేన్‌లుగా విస్తరించే నిర్మాణ పనులను కూడా మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.ఇందులో రూ. 36 లక్షలను హెచ్‌ఆర్‌డీ అధికారు లు రైల్వే అధికారులకు చెల్లించా రు. అప్పటి ట్రాఫిక్‌ రద్దీకి అను గుణంగా నిర్మించిన ఫతేనగర్‌ ప్లై ఓవర్‌ బ్రిడ్జిపై ప్రస్తుతం వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. మరో రెండు లేన్లు గా ఈ బ్రిడ్జిని విస్తరించడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించవచ్చన్న భావనలో ఉన్న ప్రభుత్వం ఈ పనులకు పూనుకుం ది. ప్రస్తుతం సనత్‌నగర్‌ ప్రాంత ప్రజలు నర్భాపూర్‌ చౌరస్తా, జీడిమెట్లకు వెళ్లాలన్నా, జీడిమెట్ల నుంచి సనత్‌నగర్‌ వైపునకు రావా లన్నా ఫతేనగర్‌ బ్రిడ్జి మాదుగా సుమారు ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తున్నది. ఈ ఆర్‌యూబీ నిర్మాణంతో కేవలం 1.8 కిలో మోటర్లు ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. దూరభారం తగ్గడమే కాకుండా ఫతేనగర్‌ ఓవర్‌ బ్రిడ్జిపై ట్రాఫిక్‌ రద్దీ గణనీయంగా తగ్గనుంది. గడిచిన 30 ఏండ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్న సనత్‌నగర్‌ ప్రాంత వాసులు ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆర్‌యూబీ నిర్మాణం చేపట్టాలన్న విజ్ఞప్తి మేరకు స్పందించిన మంత్రి నుంచి 1.8 కిమూ తగ్గుదల - నిర్మాణ పనులకు తలసానితో కలసి కెటిఆర్‌ శంకుస్థాపన తలసాని మే 15న మేయర్‌ బొంతు రాంమోహన్‌, హెచ్‌ఆర్‌డీ, రైల్వే అధికారులతో కలిసి ఆర్‌యూబీ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఆర్‌యూబీ నిర్మాణ ప్రాధాన్యాన్ని మంత్రి తలసాని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌తో చర్చించి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆర్‌యూబీ నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే హెచ్‌ఆర్‌డీ అధికారులు రైల్వే అధికారులకు రూ.89.70 లక్షలు చెల్లించారు.