తెలంగాణ లో కరోన విజృంభణ : రోజుకి రెండు వేలకి చేరువలో కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, July 13, 2020

తెలంగాణ లో కరోన విజృంభణ : రోజుకి రెండు వేలకి చేరువలో కేసులు


శుభ తెలంగాణ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,269 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,671కు చేరింది. ఇవాళ ఒక్కరోజే ఎనిమిది మంది కరోనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ఆదివారం రోజున ఆస్పత్రుల నుంచి 1,563 మంది కోలుకోని డిశ్చార్జ్‌ కాగా.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,482కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 356కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 11,883 మంది కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ 8,153 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. అందులో 6,884మందికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో 800, రంగారెడ్డిలో 132, మేడ్చల్‌లో 94 కేసులు నమోదయ్యాయి.