పుడమిపై కాలుష్య ఒత్తిడి తగ్గించాలంటే మొక్కలు నాటాలి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, July 06, 2020

పుడమిపై కాలుష్య ఒత్తిడి తగ్గించాలంటే మొక్కలు నాటాలి

పుడమిపై కాలుష్య ఒత్తిడిని తగ్గించేందుకు వ్యూహాత్మక కార్యాచరణలో భాగంగానే సీఎం కేసీఆర్  హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని రూపొందించారని, ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములై మొక్కలు విరివిగా నాటాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా రవాణా కార్యాలయంలో ఆ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మొక్కలను నాటారు. అనంతరం కార్యాలయంలో తిరిగి పరిసరాలను పరిశీలించాలి. డ్రైవింగ్ ట్రాక్, ప్రహరీ, గ్రీనరీ, శిథిలావస్థలో ఉన్న వాహనాలు పరిశీలించారు. మొక్కలు నాటేందుకు చాలా స్థలం ఉందని గ్రీనరిని మరింత పెంచాలని ఆదేశించారు. రవాణా శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ఆదర్శంగా ఉండాలన్నారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..మానవ మనుగడకు మొక్కలే ప్రధాన వనరులు అని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు తమ తమ పరిధిలో మొక్కలు నాటలన్నారు. రాష్ట్రంలో కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇంచార్జి కృష్ణ, ఆర్టీవో కిషన్ రావు, సిబ్బంది ఉన్నారు.