హైదరాబాద్,జూలై 15(శుభ తెలంగాణ): వర్షాకాలం సీజన్‌కావడంతో గ్రామా లు, పట్టణాల్లో పారిశుద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సిఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పారిశుధ్యం, క్రిమి సంహారక మందులను చల్లడం, లార్వా నివారణ చర్యలపై దృష్టి పెట్టాల ని ఆదేశించారు.పట్టణ ప్రగతి, రైతు వేదిక నిర్మాణాలపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుదవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమిక్షా సమావేశం నిర్వహించారు. కొత్తగా విలీనం అయిన (గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మునిసిపాలిటీల చట్టం ప్రాముఖ్యతనిస్తుందన్నారు. విలీన గ్రామాల్లో మౌలిక సదుపాయా ల కల్పనను కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. రైతు వేదికలకు సంబంధించి మిగిలిన అన్ని అనుమతులు ఈ నెల 18 వరకు వస్తాయ ని అనంతరం పనులను క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలన్నారు. రైతు వేదిక నిర్మాణాలను పరిశీలించేందుకు సీనియర్ అధికారులను నియమించాలన్నారు. అన్ని రైతు వేదిక నిర్మాణాలను 2020అక్టోబర్ 10వలోగా పూర్తి చేయాలన్నారు. రైతు బంధు సమస్యలు,కల్లాల నిర్మాణం, గోడౌన్ల నిర్మాణం, ప్రత్యేక ఆహార ప్రాసెసింగ్ జోన్లకు సంబం ధించిన అంశాలపై సైతం సీఎస్ భేటీలో సమిక్షించారు. ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరిం చి పనిచేయాలని ఆయన కలెక్టర్లను కోరారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పీఆర్ అండ్ ఆర్టీ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, పీఆర్ అండ్ ఆర్టీ కమిషనర్ రఘునందన్ రావు, పురపాలకశాఖ డైరక్టర్, కమిషనర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
Post Top Ad
Wednesday, July 15, 2020
పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి - జిల్లా కలెక్టర్లతో సిఎస్ సోమేశ్ కుమార్ సమిక్ష
Admin Details
Subha Telangana News