కరోనా మహమ్మారి గురించి ప్రపంచానికి చెప్పకుండా దాచి పెట్టిందని ఆరోపణలు ఎదుర్కొం టున్న చైనాకు సంబంధించి ఒక శాస్త్రవేత్త వెల్లడించిన కీలక విషయాలు తాజాగా సంచలనం రేపుతున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ దాక్టర్ లి-మెంగ్‌యాన్ ప్రాణాంతక వైరస్ గురించి చైనాకు ముందే తెలిసినా ప్రపంచాన్ని హెచ్చరించలే దంటూ బాంబు పేల్చారు. ప్రస్తుతం అమెరికాలో అజ్ఞాతంలో ఉన్న యాన్, కరోనా వైరస్ వ్యాప్తి గురించి చైనా అబద్దాలు చెప్పడమే కాకుండా, వ్యాప్తి తరువాత మానవుల నుంచి మానవులకు వ్యాప్తి గురించి కూడా కప్పిపుచ్చిందని ఆరోపించారు. గత సంవత్సరం డిసెంబరులో మహమ్మారి విస్తరణ గురించి మాట్లాడకుండా తన నోరు మూయించారని ఆమె ఆరోపించారు. వైరస్ గురించి చెప్పకుండా దాచిపెట్టిం దంటూ ఇప్పటికే అమెరికా అధ్యక్షు డు డోనాల్డ్ ట్రంప్ చైనా అగ్గిమాద గుగ్గిలమవుతున్నారు. మరో వైపు కరోనా గురించి ముందుగా తమను హెచ్చరించింది తమకార్యాలయమే కానీ, చైనా కాదని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజా ఆరోపణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హాంకాంగ్ నుంచి అమెరికాకు పారిపోయిన యాన్ ప్రాణాంతక వైరస్ గురించి ముందుగానే వైనాకు తెలుసని, ప్రభుత్వ అత్యున్నత స్థాయిలోనే గోప్యత పాటించారని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇమ్యునాలజీ నిపుణురాలు యాన్ ఈ విషయాలను వెల్లడించారు. 2020 ఆరంభంలోనే కరోనా విస్తరణ ప్రారంభమైందని, ఇన్ఫ్లూాయేంజా వైరస్లు, మహమ్మారుల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ రిఫరెన్స్ లాబొరేటరీగా ప్రత్యేకతను కలిగి ఉన్న చైనాకు.. కరోనా గురించి ప్రపంచానికి తెలియ జేయాల్సిన బాధ్యత ఉందన్నారు. అంతేకాదు, ఈ రంగంలో కొంతమంది అగశ్రేణి నిపుణులుగా గుర్తింపు పొందిన తన పర్యవేక్షకు లు తాను చేస్తున్న పరిశోధనలను కూడా విస్మరించారని ఆరోపించారు. కోవిడ్-19 ను అధ్యయనం చేసిన ప్రపంచ మొట్టమొదటి శాస్త్రవేత్తలలో తానూ ఒకరని చెప్పిన యాన్ హాంకాంగ్‌తో సహా విదేశీ నిపుణులను పరిశోధనకు అనుమతించటానికి చైనా ప్రభుత్వం నిరాకరించిందని చెప్పారు. 2019 డిసెంబర్ చివరలో చైనాలో నమోదవుతున్న సార్స్ వంటి కేసుల క్షస్టర్ను పరిశీలించమని డబ్య్యూహెచ్ఓ రిఫరెన్స్ ల్యాబ్‌లోని డాక్టర్ లియో ఆదేశించినట్టు గుర్తు చేసుకున్నారు. తనపై దేశద్రోహం ఆరోపణలు చేస్తున్నారనీ, మాతృదేశ ప్రతిష్టను దెబ్బతీశానంటూ తనను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే తన స్వస్థలమైన కింగ్జావోను స్వాధీనం చేసుకోవడంతోపాటు, తన తల్లిదండ్రులను కూడా ్రశ్చ్నించారని ఆమె వాపోయారు. ప్రభుత్వ గూండాలు తనపై సైబర్ దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. అయినా తన పోరాటాన్ని వదులుకోనని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయా న్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే అమెరికాకు పారిపోయినట్టు ఫాక్స్ న్యూస్‌తో చెప్పారు. ఇదే చైనాలో ఉండగానే వెల్లడిస్తే తనను మాయం చేయడం లేదా చంపేసేవారని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ తన జీవితం ఇంకా ప్రమాదంలో ఉందని యాన్ అభిప్రాయపడ్డారు. తన ఇంటికి తిరిగి వెళ్లలేమోననే భయం పీడిస్తోందన్నారు. ఇది ఇలా వుంటే హాంకాంగ్ విశ్వవిద్యాలయం ఆమె పేజీని తొలగించింది. వార్షిక సెలవులో ఉన్నట్టుగా చెప్పిన తర్వాత కూడా ఆన్లైన్ పోర్టల్స్, ఇ-మెయిల్‌లకు యాక్సెస్‌ను ఉపసంహరించుకోవడం గమనార్హం.