కార్పొరేట్‌ హస్పిటళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి - సీపీఎం నిరసన - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 17, 2020

కార్పొరేట్‌ హస్పిటళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి - సీపీఎం నిరసన


మేడ్చల్ ‌ జిల్లా (శుభ తెలంగాణ) : ఘట్కేసర్‌ మండల సీపీఎం కార్యదర్శి నార్కట్‌ పల్లి సబిత కరోనా కష్టాల్లో పేదలు నానా ఇబ్బందులు పడుతుంటే కార్పొరేట్‌ హాస్పిటళ్లు వారి మూలుగులను పీల్చుకుతింటున్నాయని తక్షణమే ప్రైవేట్‌ కార్పొరేట్‌ హస్పిటళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని సీపీఎం మండల కార్యదర్శి నార్కట్‌ పల్లి సబిత డిమాండ్‌ చేశారు. గురువారం ఘట్‌కేసర్‌ మండల కేంద్రములో సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సీపీఎం కార్యకర్తలు నిరసన తెలిపారు. అనంతరం సీపీఎం మండల కార్య దర్శి నార్కట్‌పల్లి సబిత మాట్లాడు తూ కరోనా వైరస్‌ రోజుకు రోజుకు తీవ్రంగా విజృంభిస్తుంద న్నారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికి ఒదిలివేసింద న్నారు. కరోనా ను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసే ప్రమా దాలు కన్పిస్తుంటే కె.సి.ఆర్‌ వెయ్యి కోట్ల రూపాయలతో సచివాలయం కట్టలనుకోవడం ప్రజాధనం దుర్వినియోగం చెయ్యడమేనని అన్నారు. తక్షణమే సచివాలయ స్‌ ఆపి కరోనా టెస్టులు పెంచి పేదల అగోనాల బాధ్యత ను చిత్తశుద్ధితో స్వీకరించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమములో ఎన్‌పిఆర్‌డి జిల్లా ఉపాధ్యక్షులు చంద్రమోహన్‌, పోచయ్య, దాసు, బిక్షపతి, రఘు, ఏ ఎమ్‌ జాఫర్‌ హుస్సే స్సేన్‌ నరసింహ,ఇనైథ్‌ ఖాన్‌ అబ్బుల్లా తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad