ఆలేరు ఎమ్మెల్యే సునీతకు కరోనా పాజిటివ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 05, 2020

ఆలేరు ఎమ్మెల్యే సునీతకు కరోనా పాజిటివ్

గత నాలుగు రోజుల నుండి స్వల్ప అస్వస్థతకు గురైన గొంగిడి సునీత హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అక్కడ ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం ఆమెకు యశోద ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు చెబుతున్న పరిస్థితి ఉంది. ఇక తనకు కరోనా పాజిటివ్ రావడంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తన ఆరోగ్యం బాగానే ఉందని, ఆ లక్ష్మీ నరసింహ స్వామి దయ, ఆలేరు ప్రజల అభిమానంతో త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు ఆరోగ్యంగా వస్తాను అని గొంగిడి సునీత పేర్కొన్నారు.