ట్రాఫిక్ పోలీస్స్టేషన్ నిర్మాణాన్ని పరిశీలించిన సిపి మహేష్ భగవత్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 24, 2020

ట్రాఫిక్ పోలీస్స్టేషన్ నిర్మాణాన్ని పరిశీలించిన సిపి మహేష్ భగవత్


యాదాద్రి భువనగిరి,జూలై 23(శుభతెలంగాణ): భువనగిరి పట్టణం పాత పోలీస్ స్టేషన్లో నూతనంగా నిర్మిస్తున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనుల్ని రాచకొండ సీపీ మహేష్ భగవత్, డీసీపీ నారాయణ రెడ్డి కలిసి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు అనంతరం ఆరోవిడుత హరితహారంలో భాగంగా సీపీ మొక్కలు నాటా రు. ప్రతి పోలీస్ స్టేషన్లో మొక్కలు విరివిగా నాటి పచ్చదనాన్ని పెంపొం దించాలని సీపీ మహేష్ భగవత్ సూచించారు. ప్రతి ఒక్కరూ దీనిని బాధ్యతగా గుర్తించాలన్నారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందు బాటులో ఉంటారని అన్నారు