తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 09, 2020

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఉత్తర కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది.
బుధవారం మెదక్, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, జనగామ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక శుక్రవారం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరకొస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
శుక్రవారం దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలోనూ పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు వచ్చిన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే, కొద్ది రోజులుగా విరామం ఇచ్చాయి. మళ్లీ ఇప్పుడు వర్షాలు వరుసగా మూడురోజులపాటు కురియనున్నాయి.