ఎవరి ఆదేశాలను కేసీఆర్ లెక్క చేయట్లేదన్న రేవంత్... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 02, 2020

ఎవరి ఆదేశాలను కేసీఆర్ లెక్క చేయట్లేదన్న రేవంత్...

కరోనా వైరస్ నియంత్రణ విషయంలో అటు ప్రతిపక్షాలు,ఇటు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పడుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నా ప్రజల ఆరోగ్యం గురించి పట్టింపు లేని ధోరణితో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేసీఆర్ సర్కార్ కరోనా నియంత్రణలో పూర్తిగా వైఫల్యం చెందిందని... ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఇక్కడ కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖ ద్వారా కోరారు.రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని... రాబోయే రోజుల్లో హైదరాబాద్ హాట్ స్పాట్‌గా మారే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టింపు లేని విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌ను, హైకోర్టు ఆదేశాల‌ను, ఐసీఎంఆర్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌భుత‌్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం,వైఫల్యం కారణంగా రాబోయే రోజుల్లో హైదరాబాద్ పరిస్థితి దారుణంగా మారబోతుందని... కాబట్టి కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.దేశంలోనే అత్య‌ధిక కేసులున్న మ‌హారాష్ట్రలో క‌రోనా పాజిటివ్ రేటు 22శాతం ఉంటే, తెలంగాణ‌లో 27శాతం ఉంద‌ని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి దేశ, విదేశాలకు ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇన్‌ఫెక్షన్ రేటు కూడా ఎక్కువగా ఉండే అవకాశముందన్నారు. రాష్ట్ర పొరుగు రాష్ట్రం ఏపీలో ఇప్పటివరకూ 6 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేస్తే... ఇక్కడి ప్రభుత్వం మాత్రం
ఇప్పటివరకూ కేవలం 70వేల కరోనా పరీక్షలు మాత్రమే చేసిందన్నారు.ల్యాబ్‌లపై ఒత్తిడి పెరిగిందన్న సాకుతో గత 4 రోజులుగా రాష్ట్రంలో అసలు టెస్టులే చేయట్లేదని రేవంత్ పేర్కొన్నారు. చేసిన టెస్టులకు సైతం ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయని... దాంతో వ్యాధి ముదిరి మరణాల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. ఏపీలో 42 ట్రూనాట్ కిట్స్ ఉంటే తెలంగాణలో 22 మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైనా టెస్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు.