రైతులకు సేవల కోసమే వేదికలు సకాలంలో పూర్తి చేయాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 25, 2020

రైతులకు సేవల కోసమే వేదికలు సకాలంలో పూర్తి చేయాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి


నిర్మల్,జూలై 24(శుభ తెలంగాణ): వ్యవసాయాధికారులు అందు బాటులో ఉండి రైతులకు మరిన్ని సేవలందించేందుకు రైతు వేదికలు ఎంతగానో ఉపయోగ పడుతాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు జిల్లాలో కొన సాగుతున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. దసరాకల్లా నిర్మాణ పనులను పూర్తి చేయించి ప్రారంభా నికి సిద్ధంగా ఉంచాలని స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచిం చారు. అలాగే రైతులు సాగు చేసే పంటల వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అన్నారు.పంటల వివరాలను సర్వే నంబర్ ప్రకారం ఏపంట వేస్తున్నారో వాటి వివరాలను విస్తరణ అధికారి వద్ద కచ్చితంగా నమోదు చేసుకోవాలన్నారు. పంటల వివరాలను తప్పకుం డా నమోదు చేసుకోవాలని అన్నారు. రైతులందరూ పంటల వివరాలను విస్తరణ అధికారులకు తెలుపాలని అన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే నియంత్రిత పంటల సాగును తెచ్చిందన్నారు. రైతులు పంట ఎంత విస్తీర్ణంలో వేశారో సిబ్బందికి తెలియజేయాలన్నారు. దీన్నిబట్టీ రైతు బంధుకు అర్హులను గుర్తిస్తామన్నారు. వాతావరణ సమతుల్యత కోసం హరితవనాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలి పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రజలు పాల్గొని హరితవనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు