నాలుగు దశాబ్దాలుగా నాబార్డ్‌ అందించిన సేవలు మరువ లేనివని : వికాస్‌ అగ్రిపొండషన్‌ చైర్మన్‌ నాసి రెడ్డి సాంబశివ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 14, 2020

నాలుగు దశాబ్దాలుగా నాబార్డ్‌ అందించిన సేవలు మరువ లేనివని : వికాస్‌ అగ్రిపొండషన్‌ చైర్మన్‌ నాసి రెడ్డి సాంబశివ రెడ్డి


ములుగు జిల్లా (శుభ తెలంగాణ) : మంగపేట వ్యవసాయ రంగం గ్రామీణాభివృద్ధిలో గడచిన నాలుగు దశాబ్దాలుగా నాబార్డ్‌ అందించిన సేవలు మరువ లేనివని వికాస్‌ అగ్రిపొండషన్‌ చైర్మన్‌ నాసి రెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. మండలంలోని అఖినేపల్లి మల్లారంలో వికాస్‌ అగ్రిపొండషన్‌ (యన్దిఓ) వివేకా పార్శర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎఫ్పిఓ) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ నాబార్జు వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి మాట్లాడుతూ భారతా వని అభివృద్ధిలో నాబార్డు చెరగని ముద్ర వేసిందన్నారు. రైతుక్షబ్‌ల ఏర్పాటు జెయల్టి (గ్రూపుల ఏర్పాటుతో కౌలు రైతులకు పరపతి కల్పించడం వాటర్‌ షెడ్ల నిర్మాణం పంట రుణాల వితరణ వంటి సేవలను సాంబశివ రెడ్డి కొనియాడారు. వ్యవసాయ రంగంలోని ఆహార ఉత్పత్తి సంఘాలను నెలకొల్పి సంఘటిత పర్చేందుకు నా బార్జు వివిధ పధకాలను అమలు జరుపుతుందని తెలిపారు.రాబోయే రోజుల్లో నాబార్జు ద్వారా వివిధ పధకాలను ఎన్టిఓ ఎఫ్పిఓల ద్వారా ఏటూరునాగారం వ్యవసాయ డివిజన్‌ పరిధిలో అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపిక చేసిన రైతులకు ఇరవై వెయిల విలువ చేసే పెర్టీలైజర్‌ మినీ కిట్లని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విఏఎఫ్‌ డైరెక్టర్లు నెలపట్ల శేషా రెడ్డి తిరుపతిరావు, మల్లారం రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు షేక్‌ మాదర్‌ సాహెబ్‌, స్థానిక రైతులు పాల్గొన్నారు.