ప్లాస్మా దానానికి ముందుకు రండి - కోలుకున్న కరోనా వ్యక్తులకు సిపి సజ్జన్నార్‌ పిలుపు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 19, 2020

ప్లాస్మా దానానికి ముందుకు రండి - కోలుకున్న కరోనా వ్యక్తులకు సిపి సజ్జన్నార్‌ పిలుపు


హైదరాబాద్‌, జూలై 18(శుభ తెలంగాణ): కరోనా సోకి రికవరీ అయిన వారందరూ ఇర కరోనాపేషెంట్లను దక్కించుకునేందుకు ప్లాస్మా దానా నికి ముందుకు రావాలని సైబరాబాద్‌ పోలీస్‌ తరుపున సీపీ సజ్జనార్‌ పిలుపునిచ్చారు.వారు ఇచ్చే ప్లాస్మా ఎంతోమందికి ప్రాణం నిలబెట్ట గలదని అన్నారు. కరోనాతో కోలుకున్న వారికి సిపి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో పోలీస్‌ విభాగంలో పనిచేస్తున్న వారు కూడా ఉన్నారని అన్నారు. చాలా మంది కరోనాతో ఆస్పతుల్లో చేరుతున్నారని... కరోనావైరస్‌ రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపు తుందని అన్నారు. ఈ కోవిడ్‌ 19బారిన పడి బయట పడిన వారు ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వాలని సీపీ కోరారు. మిరు ఇచ్చే 500 ఎమ్‌ఎల్‌తో ఇద్దరు రోగులను కాపాడిన వారు అవుతాని తెలిపారు. ఇప్పటికే ఎంతో మంది పోలీసులు కోవిడ్‌ బారిన పడి కోలుకున్నారన్నా రు. సైబరాబాద్‌ పోలీసులు ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వడానికి అంగీకరించారని...దీంతో ముగ్గురిని ఆదుకున్నారని తెలిపారు. మూడు కుటుంబాలను కాపాడారని అన్నారు. ఎవరైనా ప్లాస్మా ఇవ్వాలనుకున్న వారు 9490617440కి సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్‌ పేర్కొ న్నారు. ప్లాస్మా సేకరణ ఉద్యమంగా మారాలన్నారు. మనమంతా మరి కొందరికి ప్రాణాలు ఇద్దామన్న సంకల్పంతో ముందుకు సాగుద మన్నారు.