నాసా బెల్లోన్ ల ఆట ...? - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 26, 2020

నాసా బెల్లోన్ ల ఆట ...?


వాషింగ్టన్‌ : నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ఫుల్‌బాల్‌ స్టేడియం అంత సైజులో ఉన్న భారీ బెలూన్‌ను స్ట్రాటోస్పియర్‌లోకి పంపనుంది. అందులో 2.5 మీటర్ల (8.4 అడుగుల) టెలిస్కోప్‌ను అమర్చనుంది. ఆస్ట్రోస్ (ఆస్ట్రోఫిజిక్స్‌ స్ట్రాటోఫెరిక్‌ టెలిస్కోప్‌ ఫర్‌ హై స్పెక్ట్రల్‌ రిసొల్యూషన్‌ అబ్జర్వేషన్‌ ఎట్‌ సబ్‌ మిలీమీటర్‌ వేవ్‌లెన్త్స్‌)ను అంటార్కిటికా నుంచి 2023 డిసెంబరులో ప్రయోగించనున్నారు. మిషన్‌ను నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జేపీఎల్‌) సంస్థ రూపొందిస్తున్నది. ఓ కథనం ప్రకారం.. భూమి వాతావరణం ద్వారా 'నిరోధించబడిన' తేలికపాటి తరంగదైర్ఘ్యాలను గమనించడానికి టెలిస్కోప్ బయటి వాతావరణంలో ఉంచనుంది. మానవులు చూడగలిగే దానికంటే 'చాలా పొడవుగా' ఉండే తరంగదైర్ఘ్యాలతో కాంతిని ఇది పరిశీలిస్తుంది. ఆస్ట్రోస్ లక్షా30వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది 'వాణిజ్య విమానాల విమానాల కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ'. మానవ కంటికి కనిపించని దూర పరారుణ కాంతిని అధ్యయనం చేస్తుంది. అబ్జర్వేటరీ పేలోడ్‌లో టెలిస్కోప్‌, సైన్స్‌ ఇన్‌స్ట్రుమెంట్స్, కూలింగ్‌, ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌తో కొన్ని ఉప వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు ప్రారంభంలో జేపీఎల్‌ ఇంజినీర్లు సబ్‌సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌, టెస్టింగ్‌ను ప్రారంభిస్తారు. ఇటీవల ఈ బృందం టెలిస్కోప్‌ పేలోడ్‌ కోసం డిజైన్‌ చేసింది. 'ఆస్ట్రోస్ బెలూన్ మిషన్లు అంతరిక్ష మిషన్ల కంటే ఎక్కువ రిస్క్‌తో కూడకున్నది. అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు ఇవ్వనున్నాయని ప్రాజెక్ట్ మేనేజర్ అయిన జేపీఎల్‌ ఇంజినీర్‌ అయిన జోస్‌ సైల్స్‌ అన్నారు. గతంలో ఎన్నడూ ప్రయత్నించని 'ఆస్ట్రోఫిజిక్స్ పరిశీలనలు' విజయవంతంగా నిర్వహించేందుకు ఈ ప్రతిష్టాత్మక మిషన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. 'కొత్త టెక్నాలజీలను పరీక్షించడం ద్వారా భవిష్యత్ అంతరిక్ష మిషన్లకు ఈ మిషన్ బాటలు వేస్తుందని, తర్వాతి తరం ఇంజినీర్లు, శాస్త్రవేత్తలకు శిక్షణనిస్తుందని' ఆయన పేర్కొన్నారు. మిషన్ 'కొత్తగా ఏర్పడిన నక్షత్రాల చుట్టూ వాయు కదలిక, వేగాన్ని కొలుస్తుంది'. అలాగే నాలుగు ప్రధాన లక్ష్యాలను కలిగి ఉంటుంది. ఇది పాలపుంతలో నక్షత్రాలు జన్మించిన రెండు ప్రాంతాలను గమనిస్తుంది. టెలిస్కోప్ రెండు రకాల నైట్రోజన్ ఆయానుల ఉనికిని గమనిస్తుంది. సూపర్నోవా పేలుళ్ల నుంచి వచ్చే 'గాలులు, గ్యాస్‌ మేఘాలు' అలాగే నక్షత్రాలు ఏర్పడే ప్రాంతాలను గురించి వెల్లడించనుంది. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )