ముచ్చటగా మూడో సారి పవర్ స్టార్ తో శ్రుతి హాసన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, July 20, 2020

ముచ్చటగా మూడో సారి పవర్ స్టార్ తో శ్రుతి హాసన్


'పింక్' హిందీ చిత్రాన్ని తెలుగులో 'వకీల్ సాబ్' పేరిట రీమేక్ చేస్తున్న విషయం మనకు తెలుసు. ఇందులో అమితాబ్ పాత్రలో పవన్ కల్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు. వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరికొంత భాగం షూటింగ్ మిగిలివుంది. 'పింక్'లో మరో ముఖ్య పాత్ర అయిన తాప్సీ పాత్రను ఈ చిత్రంలో ఏ హీరోయిన్ పోషిస్తోందన్నది కాస్త సస్పెన్స్ తో సాగుతోంది. ఎందుకంటే, ఇందులో తాను నటిస్తున్నట్టు శ్రుతి హాసన్ ఇటీవల ప్రకటించినప్పటికీ, తన పాత్ర గురించి వెల్లడించేందుకు మాత్రం ఆమె అంగీకరించలేదు. టాలీవుడ్ లో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి, ఆమె తాప్సీ పాత్రలో నటించడం లేదని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కి భార్యగా ఆమె మరో పాత్రను పోషిస్తున్నట్టు చెబుతున్నారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )