ప్రతి డివిజన్ కు ఫాగింగ్, స్ప్రయింగ్ మెషీన్లు : మంత్రి పువ్వాడ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, July 06, 2020

ప్రతి డివిజన్ కు ఫాగింగ్, స్ప్రయింగ్ మెషీన్లు : మంత్రి పువ్వాడ

వానకాలంలో ఉత్పన్నమయ్యే సీజనల్ వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ లోని 50 డివిజన్లలో ప్రతి డివిజన్ కు ఫాగింగ్, స్ప్రయింగ్ మెషిన్లు పంపిణీ చేశామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో 20 ఫాగింగ్, స్ప్రయింగ్ మెషీన్ల ను మంత్రి పంపిణీ చేశారు. ఒక్కో దాని ఖరీదు రూ.40వేలు గా తెలిపారు. ఇప్పటికే 30 ఫాగింగ్, స్ప్రయింగ్ మెషిన్లు అందుబాటులో ఉన్నాయని, నేడు మరో 20 కొనుగోలు చేసి అందజేశామన్నారు. 
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మీ పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవలని సూచించారు. పురపాలక మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో ఇంట్లో నిలువ ఉన్న నీరు, మురుగు, చెత్తచెదారంను తొలగించి పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి ఉన్నారు.