ప్రశాంతంగా ముగిసిన బోనాలు: దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 22, 2020

ప్రశాంతంగా ముగిసిన బోనాలు: దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి


హైదరాబాద్‌,జూలై22(శుభ తెలంగాణ): తెలంగాణలో బోనాల ఉత్సవాలు నిరాడంబరంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తల్లుల ఆశీర్వాదంతో ఈ బోనాలు ప్రశాంతంగా జరిగాయని ఆయన అన్నారు. ఉత్సవాలకు సహకరించిన భక్తులు, అధికారులు, సిబ్బంది అందరికీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి త్వరగా బయటపడేలా చూడాలని ప్రజలందరిపై కరుణ, ఆశీర్వాదం కలిగి ఉండాలని అమ్మవారిని ప్రార్ధించారు. బోనాల వేడుకలను ప్రతిసారీ అంగరంగ వైభవంగా నిర్వహించేవారమని కానీ ఈసారి కరోనా కారణంగా బోనాల సందడి లేకుండా ఉత్సవాలు జరిగాయన్నారు. ఆలయ పూజారులు, సిబ్బంది మాత్రమే అమ్మవార్లకు బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారని తెలిపారు. భక్తులు కూడా ఇండ్లలోనే బోనం సమర్పించి ప్రభుత్వానికి సహకరించారని అన్నారు.