సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 21, 2020

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీఖమ్మం,జూలై21(శుభ తెలంగాణ): జిల్లాలోని కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 60మంది లబ్ధి దారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంగళవారం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారని తెలిపారు. సబ్బండ వర్జాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తుండటంతో ప్రజల్లో ఆయనపై గౌరవం పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం ఏకతాటిపై కొనసాగు తున్నాయని వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ టిఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.