కరోనాపై పోరులో వెనక్కి పోవడ లేదు - ఎంత ఖర్చయినా ముందుకే: శ్రీనివాసగౌడ్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 28, 2020

కరోనాపై పోరులో వెనక్కి పోవడ లేదు - ఎంత ఖర్చయినా ముందుకే: శ్రీనివాసగౌడ్‌


మహబూబ్‌నగర్‌:జూలై 28(శుభ తెలంగాణ): కరోనాపై పోరులో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. కరోనా కోసం ఖర్చుకు వెనకాడకుండా వైద్యం చేయిస్తు న్నామని అన్నారు. జిల్లా స్థాయిలో కూడా చికిళ్ల్ససకు అవకాశం ఇచ్చామని అన్నారు. జిల్లాలోని జనరల్‌ దవాఖానలో వి-గార్డ్‌ ఇండస్ట్రీస్‌ సౌజన్యంతో పాలమూరు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 వెంటిలేటర్‌లు, 1000 బె-95 మాస్క్‌లను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఐఎంఏ అధ్యక్షుడు రామ్మోహన్‌ చేతులమోదుగా దవాఖాన సూపరింటెండెంట్‌ రాంకిషన్‌కు అందించారు. ఈసందర్భంగా వెంటి లేటర్స్‌, మాస్క్‌లను అందచేసిన వి-గార్డ్‌ ఇండస్ట్రీస్‌ను ఆ సంస్థ మేనేజర్‌ బాబును మంత్రి అభినందించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో కరోనా పేషేంట్స్‌కు డ్రై-హ్రట్స్‌ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభిం చారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా దవాఖాన స్థాయిలో మహబూబ్‌ నగర్‌ జనరల్‌ దవాఖానలోనే.. అన్ని వసతులతో రోగులకు వైద్యం అందిస్తున్నట్లు ఆయన వివరించారు. వైద్యుల స్థయిర్యం దెబ్బతి నేలా కొందరు మాట్లాడడం సరికాదన్నారు. వైద్యులు, సిబ్బంది ప్రాణాలకు తెగించి వైద్యసేవలు చేస్తున్నారని అన్నారు.