నారాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోన పరీక్ష కేంద్రం ప్రారంభం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 14, 2020

నారాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోన పరీక్ష కేంద్రం ప్రారంభం


మేడ్చల్‌ జిల్లా : నారాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఘట్మేసర్‌ మండల ఎంపిపి ఏనుగు సుదర్శన్‌ రెడ్డి సందర్శించి కరోనా పరీక్షలను కిట్‌ నీ దాక్టర్‌ యాదగిరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కరోనా పరీక్షల కొరకు రాష్ట్ర ప్రభుత్వం వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పరీక్షచేసిన పది నిమిషా లలో ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రజలు ఎటువంటి ఆందోళన చెంద కుందా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు మా మండల ప్రజలు దగ్గర్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినందుకు మంత్రి మల్లారెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు. కావున కరోనా పరీక్షలు కోసం ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరీక్ష చేసుకోవాల్సిందిగా ప్రజలకు కోరారు. ఈ కార్య క్రమంలో ఘట్మేసర్‌ మండల్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌ సెక్రెటరీ బైనగారి నాగరాజు, ఘట్మేసర్‌ మండల్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ యూత్‌ బాలు యాదవ్‌ సంతోష్స్‌ దాక్టర్స్‌ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.