1000 కోట్ల చైనీయుడి స్కాం: ఓ కంపెనీ డైరెక్టర్‌గా చిన్న దుకాణదారుడు? - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, August 17, 2020

1000 కోట్ల చైనీయుడి స్కాం: ఓ కంపెనీ డైరెక్టర్‌గా చిన్న దుకాణదారుడు?

ఇటీవల ఢిల్లీలో ఓ చైనా జాతీయుడిని ఐటీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారులు తమదైన శైలిలో ప్రశ్నించే కొద్ది జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు బయటపడుతున్నాయి. గత వారం ఢిల్లీలోని లూ సాంగ్ అలియాస్ పెంగ్ అనే చైనా జాతీయుడిని ఐటీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతను తప్పుడు కంపెనీలు, చిరునామాలు, షేర్లతో భారీ ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. రూ. 1000 కోట్లకుపైగా అతడు మనీలాండరింగ్ చేయడం గమనార్హం.కాగా, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు లూ సాంగ్ తోపాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ రాకెట్లో చైనీయులతోపాటు కొందరు భారతీయులు కూడా ఉన్నారు. సాంగ్ అనే ఈ చైనాయుడు చైనా కోసం ఇక్కడ రహస్యాలను సేకరిస్తున్నట్లు గుర్తించారు. గ్రోయింగ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సిల్లి కన్సల్టింగ్ సర్వీసెస్, పాన్ యూన్ టెక్నాలజీ, డైసీ లింక్ ఫైనాన్షియల్, హువాహూ ఫైనాన్షియల్ సంస్తలు ఆన్ లైన్ గేమింగ్ పేరిట దోచుకుంటున్నట్లు గుర్తించామని తెలిపారు. గురుగ్రాంకు చెందిన రాహుల్ ముంజాల్, ధీరజ్ సర్కారు, చైనాకు చెందిన లిన్ యాంగ్, మింగ్ యాంగ్, జింగ్ లింగ్ వాంగ్, ఢిల్లీకి చెందిన నీరజ్ కుమార్ తులి లను ఆయా సంస్తల డైరెక్టర్లుగా గుర్తించినట్లు తెలిపారు.