కోవిడ్ 19తో ఆప్రమత్తంగా ఉండాలి.... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 06, 2020

కోవిడ్ 19తో ఆప్రమత్తంగా ఉండాలి....


పినపాక,ఆగస్టు 05 (శుభ తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలో పలు గ్రామాల్లో ప్రజలు కరోనా వైరస్ బారిన పడుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డిలు కోరారు. బుధవారం ఏడూళ్లబయ్యారం క్రాస్ రోడ్ లో గల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ... మండల కేంద్రమైన పినపాకతో పాటు ఏడూళ్ల బయ్యారం గ్రామాల్లో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రమాదం పొంచి ఉందని అందుకు తగిన విధంగా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, స్వీయ నియత్రణ పాటించాలన్నారు. మండల వ్యాప్తంగా గల అన్ని రకాల షాపులు మధ్యాహ్నం తరువాత స్వచ్ఛందంగా బంద్ చేయాలని కోరారు. అవసరం లేనిది ఎవరూ బయటకు రావద్దన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరిం చాలనే అదేవిధంగా శానిటైజర్ కూడా వినియోగించాల న్నారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ అధ్యక్షుడు రవివర్మ, వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, నాయకులు యాంపాటి సందీప్ రెడ్డి పాల్గొన్నారు.