కోవిడ్-19 పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మాజీ ఎమ్మెల్యే పాయం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 08, 2020

కోవిడ్-19 పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మాజీ ఎమ్మెల్యే పాయం


మణుగూరు, ఆగస్టు 7 (శుభ తెలంగాణ): భద్రాద్రికొత్తగూడెం జిల్లా, పినపాక నియోజక వర్గంలోని అన్ని మండలాలలో రోజురోజుకు కరోన వైరస్ విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఆయన స్వగృహం నందు విలేకరులతో మాట్లా డుతూ కరోనా మహమ్మారిని అరికట్టే ప్రయ త్నంలో ప్రజలందరూ భాగస్వాములు కావాల న్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని , ఒకవేళ బయటకు వచ్చిన తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించాలి, సామాజిక దూరాన్ని పాటిస్తూ, మనతో పాటు మన కుటుంబాన్ని, ప్రాణాంతకమైన కరోనా భారిన పడకుండా కాపాడుకుందాం మన్నారు. కరోనా అంటే భయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటు జయించాలన్నారు.