ఎన్నికల్లో గెలిచి 20 నెలలైతుంది...!! నిరుద్యోగ భృతి ఇవ్వవా కేసీఆర్? - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 30, 2020

ఎన్నికల్లో గెలిచి 20 నెలలైతుంది...!! నిరుద్యోగ భృతి ఇవ్వవా కేసీఆర్?


హైదరాబాద్ ఆగస్టు 29 (శుభ తెలంగాణ) : ఎన్నికల్లో గెలిచి దాదాపు 2 సంవత్సరాలు కావొస్తున్నా మానిఫేస్టోలొ నిరుద్యోగులకు నిరుద్యోగ భ్రుతి ఇస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ఎక్కడ పోయారో చెప్పాలని బీ.సి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నికాంత్ డిమాండ్ చేసారు.. ఎన్నికల మాని ఫెస్టో లో నిరుద్యోగుల మీద కపట ప్రేమ చూయించి, నిరుద్యోగ భ్రుతి ఇస్తాం అని చెప్పి నిరుద్యోగుల ఓట్లు వేయించుకొని ఎన్నికల్లో గెలిచాక నిరుద్యోగులు అంటే ఎవరు ? అని ప్రశ్నించినా కే.సి.ఆర్ కి వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగుల సత్తా ఏంటో చూయిస్తాం అని ఆయన హెచ్చరించారు.. టీఎస్పీఎస్సీ ద్వార రిజిస్టర్ చేయించుకున్నా 30 లక్షల మందికి నిరుద్యోగ భ్రుతి ఇవ్వాలి ::ఈ సంధర్భాంగా నికాంత్ మాట్లడుతూ.. టీఎస్పిఎస్సి దగ్గర సుమారు 30 లక్షల మంది వర్కు రిజిస్టర్ చేయించుకున్నారని ,వాలందరికి వెంటనె నిరుద్యోగ భ్రుతి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.. కరొన సమయం లో నిరుద్యోగుల్ని విస్మరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంధర్భంగా నికాంత్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తం గా ప్రవైట్ పరంగ ఉద్యోగాలు చేస్కునే వాళ్ళకి కోలుకోలేని దెబ్బ గా ఈ కరోన మారిందని , అటు కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించక పోవడం దారుణం అన్నారు.. అటు కేంద్ర ప్రభుత్వం ,ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడొదన్ని నికాంత్ హెచ్చరించారు.. పలు కీలక శాఖలో ఉద్యోగా ఖాళీలు కరొనా విలయ తాండవం చేస్తునా ఈ సమయం లొ పలు కీలక శాఖలో ఉద్యోగాల ఖాళీలు ఉన్నా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్లు రిలీజ్ చేయకుండా మీన్ మీషాలు లెక్కిస్తు.. నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుతున్నాయ్ అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు...