రాష్ట్రానికి 3 స్కోచ్ అవార్డులు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 01, 2020

రాష్ట్రానికి 3 స్కోచ్ అవార్డులు


- టీఎస్ఎండీసీకి గోల్డ్, ఐటీ శాఖకు సిల్వర్
- రాష్ట్ర పథకాలకు జాతీయస్థాయిలో గుర్తింపు
- ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడి
- అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ ప్రతినిధి, జూలై 31(శుభ తెలంగాణ):  తెలంగాణ ప్రభుత్వం మూడు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులను దక్కించుకున్నది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అమలుచేస్తున్న పారదర్శక విధానాలకుగాను ఈ అవార్డులు దక్కాయి. స్కోచ్ సంస్థ 66వ సదస్సు సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం మూడు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులను దక్కించుకుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అమలు చేస్తున్న పారదర్శక విధానాలకు గాను ఈ అవార్డులు దక్కాయి. స్కోచ్ సంస్థ 66వ సదస్సు సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించింది. టీఎన్ఎండీసీకి ఒకటి, ఐటీ శాఖకు రెండు అవా ర్డులు దక్కాయి. వీటిలో ఒకటి స్వర్ణం కాగా, రెండు రజతం ఉ న్నాయి. డిజిటల్ ఇండియా క్యాటగిరీలో టీఎస్ఎండీసీకి గోల్డ్ అవార్డు దక్కింది. శాండ్ సేల్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టంలో ఆన్ లైన్ లో ఇసుక విక్రయాలు చేపట్టి, పారదర్శక విధానాన్ని అమలుచేస్తున్నందుకు గోల్డ్ అవార్డును అందించారు. ఈ క్యాటగిరీలో 1000 దరఖాస్తులు రాగా టీఎస్ఎండీసీకి స్వర్ణం దక్కడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఇసుక విధానం, క్రయ విక్రయాల పై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిం చాయి. ఎవరికైనా ఆన్లైన్లో దొరికే విధంగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానంతో అక్రమాలకు అడ్డుకట్ట పడగా ప్రభుత్వానికి వందల కోట్ల ఆదా యం వస్తున్నది. గతంలో ఇసుకపై సంవత్సరానికి కనీసం రూ. 15 కోట్లు కూడా దాటని ఆదాయం, తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రతి సంవత్సరం దాదాపుగా వేయి కోట్ల వరకు వస్తున్నది. వివిధ దశల్లో పరిశీలన, అధికారుల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ తరువాత టీఎస్ఎండీసీని గోల్డ్ అవార్డుకు ఎంపిక చేశారని సంస్థ ఎండీ మల్సూర్ తెలిపారు. ఏఐలో రెండు అవార్డులు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగంలో టీ-చిట్స్, క్రౌడ్ మేనేజ్మెంట్ లో రాష్ట్రానికి రెండు స్కోచ్ అవార్డులు దక్కాయి. చిట్ ఫండ్ నిర్వహణలో పారదర్శకతను నెలకొల్పేందుకు, రిజిస్ట్రేషన్స్ లో మోసాలను అరిక ట్టేందుకు బ్లాక్ చైన్ విధానాన్ని అమలుచేశారు. కేంద్ర ఎలక్ట్రా నిక్స్, ఐటీ శాఖ నిర్వహించిన 28వ ఇ-గవర్నెన్స్ జాతీయ అవార్డుల్లో కూడా టీ-చిట్స్ అవా ర్డు దక్కించుకుంది. ఇక మేడారం సమ్మక్క సారలక్క జాతరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పోలీసు బందోబస్తు నిర్వహిం చారు. ప్రజలు ఒకేచోట ఎక్కువగా గుమిగూడకుండా, తొక్కిసలాట జరుగకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడానికి క్రౌడ్ , మేనేజ్ మెంట్ సోల్యూషన్ విధానాన్ని ఐటీశాఖ సహాయంతో పోలీసులు విజయవంతంగా అమలుచేశారు.

Post Top Ad