తెలంగాణలో కొత్తగా 894 కరోనా కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, August 17, 2020

తెలంగాణలో కొత్తగా 894 కరోనా కేసులు

రాష్ట్రంలో ఆదివారం 894 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌కార్పొరేషన్‌ పరిధిలోనే 147 నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 92,255 కరోనా పాజిటివ్‌నిర్ధారణ కాగా, వైరస్‌ప్రభావంతో ఇవాళ 10 మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 703కు చేరింది. ఇవాళ 2,006 మంది వైరస్‌నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 70,132 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 21,420 మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో, ఐసోలేషన్‌కేంద్రాల్లో 14,404 మంది ఉన్నారు.

ఆదివారం 8794 మందికి కొవిడ్‌పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 7,53,349 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది. ఆదివారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 147, రంగారెడ్డి జిల్లాలో 85, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో 51 కరోనా పాజిటివ్‌కేసులు నమోదైనట్లు వివరించింది. భద్రాద్రి కొత్తగూడెంలో 9, ఖమ్మంలో 44, వరంగల్‌అర్బన్‌జిల్లాలో 44, వరంగల్‌గ్రామీణ జిల్లాలో 9 చొప్పున, ఆదివాలాబాద్‌జిల్లాలో 10, జగిత్యాల జిల్లాలో 31, జనగామా జిల్లాలో 7, జోగుళాంబా గద్వాల జిల్లాలో 21, నల్గొండ జిల్లాల్లో 37, కామారెడ్డి జిల్లాల్లో 7, సిద్దిపేట జిల్లాల్లో 58, సిరిసిల్ల జిల్లాల్లో 2, గద్వాల జిల్లాల్లో 21, పెద్దపల్లి జిల్లాల్లో 62 , సూర్యాపేట జిల్లాల్లో 12, నిజామాబాద్‌ 38, మహబూబాబాద్‌ జిల్లాల్లో 31 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

Post Top Ad