ముమ్మరంగా వాహనల తనిఖీలు! - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 04, 2020

ముమ్మరంగా వాహనల తనిఖీలు!


మంగపేట (శుభ తెలంగాణ): ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలో అంబేద్కర్ సెంటర్ వద్ద మధ్యాన్నం స్థానిక ఎస్ఏ చావల్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు భారీ ఎత్తున వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏటూరు నాగారం- భూర్గంపహాడ్ రాష్ట్రీయ రహదారి గుండా వెళ్తున్న అన్ని వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానా స్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని వివరాలు అడిగి పంపించారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల లైసెన్స్ సీబుక్ ,ఆర్సీ తదితర పత్రాలను పోలీసులు పరిశీలించారు. సరైన పత్రాలు లేని వారికి “ఈ “చలాన ద్వారా భారీగా జరిమానాలు విధించారు. ఈ తనిఖీలో సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.