సెప్టెంబర్ నెలాఖరుకు.. అదుపులో కరోనా - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 26, 2020

సెప్టెంబర్ నెలాఖరుకు.. అదుపులో కరోనా


హైదరాబాద్, ఆగస్టు 25(శుభ తెలంగాలు): సెప్టెంబరు నెలాఖరు నాటికి రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చే అవకాశముందని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ 4. శ్రీనివాసరావు చెప్పారు. కావిడ్ పై ప్రజల్లో చాలా వరకు అవగాహన పెరిగిందని, రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. బయటకు వెళ్లిన సమయంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ,, మాస్కులు ధరించాలని సూచించారు. అవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, జీహెచ్ఎంసీ పరిధిలో రావిన్ను దాదాపు అదుపులోకి తీసుకొచ్చామన్నారు. ఓహెందీ పరిధిలో కావిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనా పరీక్షల సంఖ్య గతంలో కంటే పెంచామని, రాష్ట్రంలో ఇప్పటి వరకూ 10.21 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులు నిఐంధనల మేరకే బిల్లులు వేయాలని, ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందిస్తున్నామని శ్రీనివాసరావు వెల్లడించారు. మరికొన్ని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకునే అవకాశముందన్నారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు జాతీయస్థాయి రేటు కన్నా తక్కువగానే ఉ ందన్నారు. కరోనా నివారణకు చర్యలు తీసుకోవట్లేదని తప్పుడు ప్రచారం చేస్తే బాధనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా మరణాలు 0.7 శాతం మాత్రమే ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిరోజు 40 వేల పరీక్షలు చేస్తున్నాం..మొత్తం పరీక్షల్లో, 50 శాతం పరీక్షలు ఆగస్టు నెలలోనే జరిగాయని శ్రీనివాస్ వెల్లడించారు. వైద్య సిబ్బంది కరోనా పై అలుపెరగని యుద్ధం చేస్తోందన్నారు. 2 వేలకు మందికి పైగా వైద్య సిబ్బంది ఇప్పటివరకు కరోనా బారిన పడ్డారని తెలిపారు. కరోనాతో చనిపోయిన వైద్య సిబ్బంది కుటుంబాలను ఆదుకుంటాం.. ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేయనుందని పేర్కొన్నారు. ప్రయివేట్ ఆస్పత్రుల పై వస్తున్న ఫిర్యాదులను విచారణ చేస్తున్నాం.. ఇప్పటికి ప్రతి రోజు 5 నుంచి 8 వస్తున్నాయని వెల్లడించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నామని ఆయన అన్నారు. 50 శాతం బెడ్ల అధీనం పై చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసకుంటున్నామని తెలిపారు. ఈ సీజన్లో చికెన్ గున్యా, డెంగీ, టైఫాయిడ్, మలేరియా వంటి సీజనల్ జ్వరాలు ప్రబలే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా, సీజనల్ జ్వరాల లక్షణాలు ఒకే విధంగా ఉంటాయని, ఎలాంటి లు ఉన్నా సమీపంలోని ప్రభుత్వం ఆరోగ్యకేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని శ్రీనివాసరావు తెలిపారు.