కెసిఆర్ పాలన పోవాలి.. దళితుల పాలన రావాలి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 13, 2020

కెసిఆర్ పాలన పోవాలి.. దళితుల పాలన రావాలి..


భద్రాచలం ఆగస్టు 12(శుభ తెలంగాణ) : ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ ఎస్టీ భూముల పరిరక్షణ సదస్సు స్థానిక కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ పాల్గొని మాట్లాడుతూ..... ఎస్సీ ఎస్టీ భూములను పరిరక్షించే దిశగా ఎమ్మార్పీఎస్ నాయకత్వం సిద్ధం కావాలని కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు మూడు ఎకరాల చొప్పున భూ పంపిణీ చేస్తామని కెసిఆర్ ఇచ్చిన మాట వట్టి బూటకం అని రుజువైందని దశాబ్దాల తరబడి అంతో ఇంతో ఉన్న అసైన్మెంట్ భూములను కేసీఆర్ ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం జరుగు తుందని మన భూములకు మనం కాపాడుకునేందుకు ఇప్పటికైనా సిద్ధం కావాలని అన్నారు. తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్న కెసిఆర్ తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ దళితులను మోసం చేశాడని టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితులకు మూడెక రాల భూమి ఇస్తానని ఇప్పుడు దళితులకు ఉన్న భూములను అధికా రులతో బలవంతంగా గుంజుకుని రైతు నివేదిక నిర్మాణం, స్మశాస వాటిక నిర్మాణం,సబ్ ప్లాన్ నిర్మాణం, హరిత వనం, డంపింగ్ యార్డ్ కోసం దళితుల భూములను లాక్కోవడం కెసిఆర్ వివక్షత తీస్తుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ భూముల పట్ల కేసీఆర్ ప్రభుత్వ తీరును ప్రతి గ్రామంలో ప్రచార రూపంలో శాంతియుతంగా ప్రతి ఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సోమయ్య మాదిగ, బోయ జగన్నాథం దీపంగి రమణయ్య, కాల్ రాజా, విస్సంపల్లి కృష్ణ గురునాథం, వెంకటేశ్వర్లు, వెంకన్న, కొమ్ము హుస్సేన్, తిరుపతి, వీర్రాజు, మోహన్‌రావు, ఎమ్మార్పీఎస్ జిల్లా మండల సీనియర్ వెంకటేశ్వర్లు, వీర రాఘవులు, తోకల దుర్గాప్రసాద్, కనుకు శ్రీను, సతీష, వెంకట నరసయ్య, రామ్ చందర్, రాము, రమేషు, రాణి, స్వప్న మండల అధ తదితరులు పాల్గొన్నారు.