గుండ్ల మడుగు గొత్తి కోయ గ్రామానికి టెలివిజన్ వితరణ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 01, 2020

గుండ్ల మడుగు గొత్తి కోయ గ్రామానికి టెలివిజన్ వితరణ

సీపీఐ మావోయిస్టు పార్టీ యెక్క కాలం చెల్లిన తుప్పు పట్టిన సిద్ధాంతాలకు గిరిజనులు ఆకర్షితులు కావద్దు అని కోరిన
ఏఎస్పీ డా. శభరీష్

అశ్వాపురం, జూలై31 (శుభ తెలంగాణ):   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు శుక్రవారం అశ్వాపురం మండలంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన టి. కొత్తూరు పంచాయితీ గుండ్ల మడుగు గ్రామంలో నివాసముంటున్న వలస గిరిజనుల గ్రామానికి టెలివిజన్ ను వితరణ గా ఏ ఎస్పీ డా.శభరీష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న వలస గిరిజనులకు సమాజం పై అవగాహనా వినోదం వీక్షించి మేదోశక్తిని పెంపొందించుకునేందుకు టెలివిజన్ ప్రచారాలు ఎంత గానో ఉపయోగపడతాయన్నారు. సమాజంలో మంచి చెడులను గ్రహించడం ద్వారా సంఘ విద్రోహ కార్యక్రమాలకు దూరంగా ఉండేందుకు వారిలో అవగాహన పెరుగుతుందన్నారు. వలస గిరిజనులకు సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తేవాలని సంబంధిత అధికారులతో మాట్లాడి ఆయా గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే ఎవరు కూడా సీపీఐ-మావోయిస్టు పార్టీ యెక్క కాలం చెల్లిన తుప్పు పట్టిన  సిద్ధాంతాలకు గిరిజనులు ఆకర్షితులు కావద్దు అని ఏఎస్పీ.శభరీష్ కోరారు. యువత అభివృద్ధి మార్గంలో నడుచుకోవాలని అందుకోసం తమ శాఖ నుండి సహాయ సహకారాలు అందిస్తామని ప్రత్యేకంగా కోరారు. కాలం చెల్లిన- మావోయిస్టు భావజాలానికి ప్రజల్లో మద్దతు లేదని మావోయిజం పేరుతో అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తూ అమాయక గిరిజనుల ప్రాణాలతో ఆటలు ఆడుకుంటున్నారని, యువత సంఘ విద్రోహ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ.సట్ల రాజు మరియు గ్రామ ప్రజలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.