ఇంటి వరకే వినాయక చవితి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 15, 2020

ఇంటి వరకే వినాయక చవితి


కరోనా కారణంగా వినాయక చవితి ఉత్సవాలను ఇంటికే పరి మితం చేయాలని మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రజలు బహిరంగ వేడు కలకు దూరంగా ఉండాలన్నారు. వేడుకలను ఇళ్లలోనే జరుపు కోవడం ద్వారా కరోనా కట్టడికి తోడ్పడాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్ర హాలను పూజించాలని పిలుపు నిచ్చారు. హెచ్ఎండిఏ పరిధిలోని 32 సెంటర్లలో ఉచితంగా 50 వేల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టారు. చేయనున్నా రు. వినాయక చవితి సందర్భం గా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఈ ఏడాది 8 ఇంచుల ఎత్తు గల 50 వేల పర్యావరణహిత వినాయక(మట్టి) విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. తొలి వినాయక విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహనికి అందజేశా రు. హెచ్ఎండిఏ ఉచితంగా పంపిణీ చేయనున్న వినాయక విగ్రహాలను మంత్రి ప్రారంభించా రు. ఈ ఏడాది కోవిడ్-19 పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా సామూహిక కార్యక్రమాలపై ఆక్షలు అమలులో ఉన్నందున వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఎవరి ఇండ్లల్లో వారు భక్తి శ్రద్ధలతో నిర్వహించు కోవాల ని మంత్రి కేటీఆర్ సూచించారు. ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ శు ద్ధి కార్యక్రమంలో భాగంగా రసాయనాల వాడకంతో (వినియోగంతో) రూపొందించే వినాయక విగ్రహాల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంగా హెచ్ఎండిఏ గత ఎనిమిది సంవత్సరాలుగా సాంప్రదాయ మట్టి వినాయక విగ్రహాలను కుమ్మరి కులస్తులతో తయారు చేయించి స్వచ్చంధ సంస్థల ద్వారా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్.ఎం.డి. ఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆర్వింద్ కుమార్ , కార్యదర్శి, బిపిపి ఓఎస్థి సంతోష్, చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad