కరోనాకు ప్రపంచస్థాయి వైద్యం: ఈటల - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 04, 2020

కరోనాకు ప్రపంచస్థాయి వైద్యం: ఈటల


హైదరాబాద్, ఆగష్టు 03 (శుభ తెలంగాణ): ప్రపంచ వ్యాప్తంగా కరోనా చికిత్సకు అందుబాటులో ఉన్న పద్ధతులను తెలంగాలు రాష్ట్రంలో ఉన్న ప్రతి సభుత్వ ఆసుపత్రిలో అందిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపాడు. ఇన్ఫెక్షన్ డిసీజ్ లో నైపుణ్యం గల డాక్టర్స్ తో తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్, చికిత్స అంది స్తున్న డాక్టర్స్ తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ.... కరోనాకు రాష్ట్ర మంతా ఒకే వైద్య విధానం ఉండాలని స్పష్టం చేశారు. కరోనా వచ్చిన వారు జబ్బుతో కంటే భయంతో ఎక్కువ మంది చనిపోతున్నారన్నారు. పాజిటివ్ పేషెంట్ల లో ధైర్యం నింపాలని సూచించారు. యాంటీ వైరల్ మందులకంటే స్టెరాయిడ్ మందులు ఎక్కువ మందికి నయం చేస్తాయన్నారు. సీటీ స్కాన్ వల్ల ప్రయోజనం లేదని... ఎంత తొందరగా డాక్టర్ చికిత్స మొదలు పెడితే మరణాలను అంత తగ్గించవచ్చని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయ్ ఎల్లంది. హైదరాబాద్ కు చెందిన డా, ఎంవీ రావు, డాక్టర్ సునీత, చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, నిమ్స్ వైద్యులు గంగాధర్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని ఆసుపత్రుల వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు.

Post Top Ad