రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని బిజెపి డిమాండ్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 18, 2020

రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని బిజెపి డిమాండ్..


పటాన్ చెరువు నియోజకవర్గంలోని అమీనాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరం గుడా కమాన్ నుండి కిష్టారెడ్డి పేట రోడ్డు ను వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆడిల్లి రవీందర్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోడ్డుపై ప్రయాణికులు నిత్యం వాహనదారులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. సోమవారం బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో రోడ్డుపై మొక్కలను నాటామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్డు పనులు చేపట్టాలని లేనిచో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువ మోర్చా నాయకులు, అమీన్ పూర్ బీజేపీ కౌన్సిలర్ మరియు సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు మాధురి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad