నేను క్షేమంగానే ఉన్నాను.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 09, 2020

నేను క్షేమంగానే ఉన్నాను..


సంగారెడ్డి జిల్లా (శుభ తెలంగాణ): అందరి దీవెనలతో ఆరోగ్యంగా ఉన్నాను అని పటా న్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజల దీవెనలతో తాను ఆరోగ్యంగా ఉన్నట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఒక వీడియో సందేశం పంపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు ఎప్పటికప్పుడు తన ఆరోగ్యం గురించి ఆస్పత్రి వైద్యులతో మాట్లాడుతున్నారని, అపోలో ఆసుపత్రి వైద్యులు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారని తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన మరోసారి కోరారు.