రైతు వేదిక పార్క్ నిర్మాణ పనులు నిర్మించుకోవడానికి కలెక్టర్ పర్మిషన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 28, 2020

రైతు వేదిక పార్క్ నిర్మాణ పనులు నిర్మించుకోవడానికి కలెక్టర్ పర్మిషన్


గజ్వేల్ ఆగస్టు 27 (శుభ తెలంగాణ) : మర్కుక్ మండలం లోని గంగాపూర్ హనుమాన్ దేవాలయం భూమిలో పార్క్ నిర్మించుకోవ డానికి జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆదేశించారు. గురువారం ఎర్రవల్లిలో నిర్మిస్తున్న రైతు వేదిక వద్ద గంగాపూర్ గ్రామస్తులు కలెక్టర్ వెంకటరామిరెడ్డిని కలిసి మాట్లాడారు. హనుమాన్ దేవాలయానికి సంబంధించిన భూమిలో రైతు వేదిక నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి సార్.. గ్రామస్థులు కోరారు. వెంటనే కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తహసిల్దార్‌ను ఆదేశించారు. వెంటనే పార్కు నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. పార్కు నిర్మాణ పనులలో ఎవరైనా అడ్డుపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ములుగు డివిజన్ ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, వార్డు సభ్యులు దేవి రాం చంద్రం, గ్రామస్తులు లచ్చి రామ్ సింగ్, హిరా మాన్ సింగ్, కుశల్ సింగ్, రాజేందర్ సింగ్, రామ్ సింగ్, రమేష్, రామచంద్రం, దాడి రవి తదితరులు పాల్గొన్నారు.