బస్తి దావఖాన ఏర్పాటుకై ఎమ్మెల్యే వివేకానంద కు.. వినతి పత్రం ఇచ్చిన కార్పొరేటర్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 14, 2020

బస్తి దావఖాన ఏర్పాటుకై ఎమ్మెల్యే వివేకానంద కు.. వినతి పత్రం ఇచ్చిన కార్పొరేటర్..


కుత్బుల్లాపూర్ 13 ఆగస్టు (శుభతెలంగాణ) : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, 126 జగద్దిరిగుట్ట డివిజన్ పరిధిలో బస్తీ దావాఖాన ఏర్పాటుకై ఈ రోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తో 126 గగ్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం అవ్వడం జరిగింది. ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి బస్తి దావాఖనను ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే 129 సూరారం డివిజన్ పరిధిలోని భూగర్భ డ్రైనేజీ సమస్యలపై సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా కావలసిన చోట భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.