మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 18, 2020

మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం..


గజ్వేల్ 17 ఆగస్టు (శుభ తెలంగాణ): సోమవారం జగదేవ్పూర్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం లో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక శాసన సభ్యులు కీర్తిశేషులు సోలిపేట రామలింగారెడ్డి ఉ ద్యమకారుడు, ప్రజల మనిషి వారు అనారోగ్యంతో మరణించడం బాధాకరమని వారికి సంతాపాన్ని తెలిపారు. ఈ సమావేశాన్ని సంతాపం తెలుపుతూ వాయిదా వేశారు. అనంతరం వారు మాట్లాడు తూ వర్షాలు అధికంగా పడుతున్న ఈ సమయంలో ఎక్కడైనా చెరువు ప్రజలకు కుంటలకు గండ్లు పడితే వెంటనే ఎమ్మార్వోకి, ఎంపిడిఓకి సమాచారాన్ని అందించాల న్నారు. గ్రామాలలో పాత ఇల్లు కూలి పోయిన కానీ ఎమ్మార్వోకి ఎంపిడిఓకి సమాచారాన్ని అందిం చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీ పి బలేషం గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad