ముంపు ప్రాంతాల్లో పర్యటించిన పీవో - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 19, 2020

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన పీవో


దుమ్మగూడెం 18 ఆగస్టు (శుభ తెలంగాణ) : గోదావరి వరదలలో మునిగిపోయిన గ్రామాలలో మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్, ఐటీడీఏ పీవో గౌతమ్, భద్రాచలం ఏ ఎపి రాజేష్ చంద్రాలు పర్యటించారు. పర్ణశాల గ్రామంలో నీటమునిగిన ప్రాంతాలను సందర్శించి గ్రామస్తులను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు గ్రామాలైన దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల, చిన్న బండిరేవు,సున్నం బట్టి గ్రామాలను సందర్శించిన జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య . టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి డా. తెల్లం వెంకట్రావు, మండల టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు అన్నే సత్యనారాయణ మూర్తి, స్థానిక జడ్పిటీసీ తెల్లం సీతమ్మ ప్రభుత్వ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.