మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 29, 2020

మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్..


కొత్తగూడెం, ఆగస్టు 27 (శుభ తెలంగాణ) : కొత్తగూడెం మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికలు శుక్రవారం జరిగినాయి. కొత్తగూడెం శాసన సభ్యు డు వనమా వెంకటేశ్వరరావు నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగగా నాలుగు సీట్లును టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. కో ఆప్షన్ ఎన్నికల్లో అభ్యర్థులు ఎండి. యాకూబ్, దుంపల అనురాధ,కనుకుంట్ల పార్వతి, డి.బుచ్చయ్య ఎన్నికై నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వం రావు మాట్లాడుతూ గెలుపొందిన అభ్యర్థులు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న తీరుస్తూ కష్టపడి పని చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలని, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవడం కొత్తగూడెం అభివృద్ధికి సంకేతమని అన్నారు. కోఆప్షన్ ఎన్నికల్లో గెలవడం పట్ల రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ వనమా రాఘవేంద్ర రావు అభినందనలు తెలియజేశారు.