కార్యదర్శులపై పనిభారం తగ్గించాలి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 14, 2020

కార్యదర్శులపై పనిభారం తగ్గించాలి


మణుగూరు, ఆగస్టు 13(శుభ తెలంగాణ): గ్రామపంచాయతీలలో కార్యదర్శులపై పనిభారం తగ్గించాలని గ్రామ కార్యదర్శులు తెలిపారు. గురువారం స్థానిక ఎంపిడీవో షిలార్ సాహెబ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోజుకు ముప్పై మూడు రకాలు పంచాయతీ రికార్డుల నిర్వహణతో పాటు, హరిత హారం, కరోనా సంబంధిత ప్రత్యేక విధులు, ఫీల్డ్ అసిస్టెంట్ల పనులు భారంగా మారయ్యాన్నారు. వృత్తి పై మానసిక ప్రభావం చూపు తుందన్నారు. ఈ కార్యక్రమంలో రేష్మా, సునీత, సంధ్య, యాకూబ్ అలీ, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.