కిష్టారెడ్డిపేట్ రోడ్డు వెడల్పు.. పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 27, 2020

కిష్టారెడ్డిపేట్ రోడ్డు వెడల్పు.. పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే


సంగారెడ్డి జిల్లా ఆగస్టు 26 (శుభ తెలంగాణ) : పటాన్ చెరువు ఈ నెల 30వ తేదీన బీరంగూడ - కిష్టారెడ్డిపేట్ రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించనున్నట్టు పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అమీస్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. 50 కోట్ల రూపాయలతో విస్తరణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తానని ఆయన తెలిపారు. విస్తరణ సందర్భంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఇప్పటికే అధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు.గత న్నికల సభలో బీరంగూడ కృష్ణా రెడ్డి పేట రోడ్డు విస్తరణ అంశం పైన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ త్వరలోనే పూర్తిచేసి ప్రజల మన్ననలు పొందుతామని అన్నారు. ప్రతిపక్షా లు ప్రతి అంశంపై రాజకీయం చేయకుండా అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాస్యం ఉన్నప్పటికిని అభివృద్ధి విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ వెనకడుగు వేయలేదు అని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, కమిషనర్ సుజాత, హెచ్ఎండిఎ డి ఈ దీపక్ కుమార్, ట్రాన్స్ కో డిఈ రమేష్ చంద్ర, ఏడి శ్రీకాంత్,ఏడి ఆనంద్ బాబు,ఏఈ సమ్మయ్య, ఏఈ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.