సర్కారు నిర్లక్ష్యం... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 28, 2020

సర్కారు నిర్లక్ష్యం...


గజ్వేల్: 27 ఆగస్టు (శుభ తెలంగాణ) జగదేవపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు! ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో రైతులకు ఎరువులను పంపిణీ చేయాలని అలాగే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఎకరాకు 30 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో కురుస్తున్న వర్షాలకు కూలిపోయిన ఇండ్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయాల న్నారు. నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నూతన పెన్షన్ లు మంజూరు చేయకపోవడంతో అర్హులైన వారు ఎందరో ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం విఫలం అయిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలను రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నామన్నా రు. ఈ సమావేశంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ మల్లేశం ఎంపీటీసీలు మహేందర్ రెడ్డి మహేష్ కాంగ్రెస్ పాల్గొన్నారు....