నియోజక వర్గానికి.. తక్షణమే నిధులు మంజూరు చేయండి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 27, 2020

నియోజక వర్గానికి.. తక్షణమే నిధులు మంజూరు చేయండి


మణుగూరు ఆగస్టు 26 (శుభ తెలంగాణ): హైదరాబాద్ లో ప్రభుత్వ విప్ పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు బుధవారం మంత్రి కేటీఆర్ ను కలిసి నియోజకవర్గంలోని వరదల వలన సంభవించిన సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వలన గోదావరి ఉగ్రరూపం దాల్చి వరదలకు పినపాక నియోజకవర్గంలో రహదారులు, వంతెనలు కోతకు గురయ్యాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించే పంట పొలాలు నీట మునిగి పాడైపోయ్యాయని ఆ లేఖలో పేర్కొన్నారు. బిటిపిఎస్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన భునిర్వాసితుల ఉద్యోగ నియామకం చేపట్టాలని, వర్షాలకు దెబ్బతిన్న రహాదారులు, వంతెనలు మర్మతులు చేయుటకు నిధులు సమకూర్చి తక్షణమే చర్యలు చేపట్టాలని, పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాల ని మంత్రి కేటీఆర్ ని రేగా కాంతారావు కోరారు.