కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 30, 2020

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ


సంగారెడ్డి జిల్లా ఆగస్టు 29(శుభ తెలంగాణ) పటాన్ చెరువు రామచంద్రపురం డివిజన్ లోని లబ్ధిదారులకు షాదీ ముబారక్ కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి పాలుగోన్న లబ్దిదారులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి సారిగా పేద ఇంట్లో వివాహం జరిగితే లక్ష రూపా యలు అందించాలన్న గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి సంక్షేమ పథకాలను అందించడం జరిగింది. తెలంగాణలోని ప్రతి ఒక్కరు నిండు మనసుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించాలని తెలిపారు. ప్రస్తుతం విపత్కర సమయంలో సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ఎక్కడ వెనుకంజ వేయడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ కౌంట అంజయ్య, భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.