వరద బాధితులను ఆదుకుంటాం! - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 19, 2020

వరద బాధితులను ఆదుకుంటాం!


వరంగల్, ఆగస్టు 18(శుభ తెలంగాణ); నాలాలు, చెరువులను ఆక్రమించుకుని కట్టడాలు చేపట్టడం వల్లనే వరంగల్ నగరం నీటమునిగిందని మంత్రి కెటిఆర్ సహా పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. కబాలను తొలగిస్తే తప్ప వరంగలకు ముక్తి లేదని కెటిఆర్ అన్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్, సహచర మంత్రి ఈటల రాజేందర్ కలిసి వరంగల్ నగరాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో దిగారు. అక్కడి నుంచి నయీం నగర్, కేయూ 100ఫీట్ రోడ్ మొదలైన వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వీరివెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కూడా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసు కున్నారు. వర్షం కారణంగా జరిగిన నష్టానికి అందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని, మరోసారి ఈ సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. నాలాల వెంట అక్రమ నిర్మాణాలు చేయడం వల్లే ఈసమస్య వచ్చిందని, ఈ అక్రమ నిర్మాణాలు అన్నిటినీ తొలగి స్తామని, ఇందుకు ప్రజలు సహకరించాలని మంత్రి కేటీఆర్ కాల ని ప్రజలను కోరారు. వర్షాల కారణంగా నష్టపోయిన వారినిఆదు కోవ డంతో పాటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు బండప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మా రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ గుండా ప్రకాష్ రావు, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, జిల్లాల అధికారులు పాల్గొన్నారు. తాత్కాలిక సాయం చేయడంతో పాటు శాశ్వత పరిష్కారం అందిస్తామ న్నారు. వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకులు అందించాలని అధికారులను కెటిఆర్ ఆదేశించారు. - ఎంజిఎంలో పరామర్శ : కరోనా నియమాలు పాటిస్తూ ఎంజీఎం దవాఖానలో కొవిడ్ వార్డులోకి వెళ్లి కరోనా బాధితులను మంత్రి కెటిఆర్ తదితరులు పరామర్శించారు. కరోనా సోకితే భయపడొద్దని ధైర్యంగా కరోనాను ఎదుర్కోవాలని బాధితులకు ధైర్యం చెప్పారు. కరోనా పేషెంట్ల కోసం అదనంగా 150 పడకలను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. అవసరమైన ఆక్సిజన్ వెంటి లెటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ప్రత్యేక కొవిడ్ హాస్పిటల్ గా కేఎంసీని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.