మట్టి విగ్రహాలను పూజిస్తేనే మేలు : కలెక్టర్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 22, 2020

మట్టి విగ్రహాలను పూజిస్తేనే మేలు : కలెక్టర్..


సిరిసిల్ల, ఆగస్టు 21(శుభ తెలంగాణ) : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ ఇంట్లో మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ డి. కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వారి సౌజన్యంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన 1000 ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపి టీ స్టాల్ ను ప్రారంభించి, విగ్ర హాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారితో తయారు చేసిన విగ్రహాలతో జల కాలుష్యం పెరిగి మానవాళికి ముప్పు వాటిల్లుతుందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారితో తయారు చేసిన విగ్రహాల వాడకాన్ని తగ్గిం చి మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించేందుకు ప్రజలు ఆసక్తి చూపాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో వినాయక చవితి పండుగను ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఇండ్లలోనే భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అర్.అంజయ్య, సహాయ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, తహసీల్దార్ అంజన్న, కలెక్టరేట్ పర్యవేక్షకులు గంగయ్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.